ఇదే నా మొదటి వ్రాత. తెలుగులో బ్లాగు వ్రాయాలన్న నా ప్రయత్నం ఇన్నాళ్ళకు సఫలమైనందుకు చాలా ఆనందంగా వుంది. ఇందుకు కారణమైన సహ బ్లాగర్లకు కృతఙతాభివందనాలు...
ఓ కవి అన్నట్లు...
అలతి తేనియకన్న, నామని తఱి
కొసరి కూసిన కోయిల కూతకన్న
ముద్దులొలికెడి జవరాలి మోనికన్న
తీయనైన దెయ్యది? అదే తెనుగు బాస
అట్టి తెలుగు భాషలో, తెలుగు మాట్లాడడమే మృగ్యమై పోతున్న ఈరోజుల్లో, ఎప్పుడో అటకెక్కించేసిన రాయాలన్న అభిరుచిని కిందకు దించి, దుమ్ము దులిపి, వ్రాయడం మొదలు పెట్టడం ఎంతో ఆనందాన్నిస్తోంది.
ఎన్ని రోజులయ్యింది ఇంతమాత్రం తెలుగు వ్రాసి! బెంగళూరులో సైన్ బోర్డులు స్వచ్చమైన కన్నడంలో చూసినప్పుడు,ఇక్కడి వారికి వారి భాషపై గల మక్కువను గమంచినప్పుడు, నాకనిపిస్తుంది, మనము తెలుగును క్రమేపీ మరచిపోతున్నామని.. కానీ తెలుగుకు జీవం నింపడానికి ఔత్సాహిక నెటిజన్ల ప్రయత్నం చూసి, ఎంతో స్వాంతన కలుగుతోంది.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు...
ఎంతో వ్రాయలని వుంది.. కానీ లేఖిని లో నా టైపింగ్ వేగం, నా మొదటి వ్రాతను ఇక్కడే ఆపేలా చేస్తోంది..
వందనాలు..!!!
వందనాలు..!!!
4 comments:
Congrats Girish... For starting this new venture...Let mine be the first comment...Though I dint understand your mothertongue...Cheers
James
Hiii
Did not know the literary side of u!!Any blogs in English.
kshama
Post a Comment