Thursday, April 3, 2008

ఉదయ రాగం...

ఓ ప్రభూ!
నీ కృపారస కౌముదిలో కేరింతలు కొడుతూ
నిన్ను మాత్రం మరచితిని!
నీ ప్రేమామృత ధారను గ్రోలుచూ
నీ ఉనికిని గురుతించనైతిని!

ప్రేమతో చాచిన నీ చేతిని విదిలించుకుని
ఆకర్షణల ఎండమావుల వెంట పరుగెట్టి,
రాయి తగిలి, కాలి వేలు చిట్లి, ఏడుస్తూ నే కూర్చుంటే,
నన్నూరడించి, లాలించి, చేయి పట్టుకుని నడక నేర్పి,
ప్రపంచాన్ని అందంగా నా ముందావిష్కరించి
మాయ పరదాల చాటున మాయమౌతావు!

ప్రపంచాన్ని చూసి మైమరచిన నేను
ఒక్క సారిగ నువ్వు లేవని గుర్తించి,
ఏడుస్తూ నీకొసం వెతుకుతుంటే,

నీ చిరునవ్వుల వెలుగు నా కన్నీటి చుక్కపై పడి
ఇంద్రధనుస్సై మెరుస్తుంది!
అప్పుదు గ్రహిస్తాను,నీ ఒడిలోనే ఉన్నానని…..
-:x:-
చలం తన 'గీతాంజలి' కి ముందు మాటగా అన్నట్లు... Faith is the bird, that feels the light, when the dawn is still dark.

నా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘఠనతో ముడిపడిన ఈ కవిత, నాకో కొత్త పధాన్నీ, ధృక్పధాన్నీ అందించిన ఈ కవిత, నా 'ఇష్టం'...నా కిష్టం!
వ్యాకరణ దోషాలుంటే చదువర్లు మన్నించగలరు.

3 comments:

సత్యసాయి కొవ్వలి Satyasai said...

ఇదే పేరుతో ఇన్నయ్యగారి బ్లాగుందని మీరుగ్రహించారో లేదో..మీ బ్లాగు పేరు సాంతం మీదే ఐతే బాగుంటుందేమో.

Kottapali said...

సత్యసాయి గారు, ఇన్నయ్య గారి బ్లాగు పేరు నా ప్రపంచం .. అంచేత ఇది వోకే.

GIREESH K. said...

సత్యసాయిగారు, నేను మొదట ఇన్నయ్యగారి బ్లాగును గమనిచలేదు...as suggested, పేరు మార్చాను... Thnk you.

Cheers,
Gireesh