ప్రభూ!
అమ్మ ఒడిలోని చిన్నారిలా
జోకొట్టి, నన్ను నిదురపుచ్చి,
రంగురంగుల స్వప్నాలను
నా ముందావిష్కరించి,
సడి చేయకుండా నానుంచి
దూరమౌతావు......
నా స్వప్నలోకంలో విహరిస్తూ,
నన్ను ముంచెత్తుతున్న నీ
ప్రేమామృత ధారను గుర్తించలేని అశక్తుణ్ణి.
ఇంతలో ఓ దుస్స్వప్నం,
ఉలిక్కిపడి నిద్దుర లేచి చూద్దును కదా...
నువ్వు నాచెంత లేవు.
నా వెదకులాట మళ్ళీ మొదలు,
నీళ్ళు నిండిన కళ్ళతో
దూరమైన నీకోసం
మళ్ళీ నా అన్వేషణ మొదలు..
నన్ను నీ దరికి చేర్చే ఈ దుస్స్వప్నాలకు
ఎలా తెలుపను నా కృతజ్ఞతలు?
(Sri Ram గారి 'Smiling Tears' లోని ఓ కవితకు స్వేచ్చానువాదం.. )
5 comments:
మంచి టేష్టు మీది. ఇది అనువాదంలా అనిపించటం లెదు. చాలా బాగుంది.
నన్ను నీ దరికి చేర్చే ఈ దుస్స్వప్నాలకు
ఎలా తెలుపను నా కృతజ్ఞలు?
అనే వాక్యం రెండు సార్లు నాచే కవితను చదివించింది. సుపెర్బ్ ఎండింగ్.
బొల్లోజు బాబా
చాలా థాంక్సండీ బాబా గారు, ఏ కామెంటూ రాకపోవడంతో, నా రచనా సామర్ధ్యంపై నమ్మకం సడలింది.
Thanks a lot for the feedback!
- Gireesh
గిరీష్ గారు,కవితావస్తువు సంగతెలా ఉన్నా అనువదించిన తీరు ఆకట్టుకుంది.
కానీ చిన్నచిన్న భాషాదోషాలు..
అసక్తుణ్ణి-అశక్తుణ్ణి
కృతజ్ఞలు?- కృతజ్ఞతలు
దుస్స్వప్నం కంటే చక్కగా తెలుగులో పీడకల అంటే ఇంకా బాగుంటుంది.
మరోమాట వచ్చిన కామెంట్లను బట్టి రచయిత/కవి/వ్యాసకర్త/బ్లాగరు సంతోషించటం సహజమే కానీ,మీసామర్ధ్యానికి అవి మాత్రమే తూనికరాళ్ళు అని భావించకండి.గొప్పబ్లాగు టపా అనిపించుకున్న వాటికి కూడా చాలా సార్లు అసలు కామెంట్లే రావు.మీ కృషి కొనసాగించండి.
చాలా బాగుంది. గుండెకు హత్తుకునేలా.
‘నిద్దురపుచ్చి’ బదులు ‘నిదురపుచ్చి’ అంటే సౌండ్ బాగున్నట్టుంది చూడండి,కాస్త తేలికగా.
@రాజేంద్ర కుమార్ గారు, తప్పులు సరిచేసాను. కృతజ్ఞతలు!
బ్లాగింగ్ కు కొత్త కావడం వలన, నేను వ్రాసిన వాటికి ఏ కామెంట్లూ రాకపోవడంతొ, బహుశా జనరంజకంగా వ్రాయట్లేదేమో లేక నేనెంచుకుంటున్న విషయాలు అంత జనరంజకం కావేమో అన్న చిన్న సంశయం నాకు.
మీ సలహాకు కృతజ్ఞతలు!
@అహేష్ కుమార్ గారు, మీరు సూచించిన మార్పు చేసాను. మీరన్నట్లే బాగుంది. కృతజ్ఞతలు!
- గిరీష్
Post a Comment