Wednesday, June 18, 2008

అంతర్ముఖం

మౌనంగా ఉంటూనే మాట్లాడాలని ఉంది!
పొర్లిపడే వెన్నెలతో పోట్లాడాలని ఉంది!
-సినారె


నన్ను చాన్నాళ్ళపాటు వేధించిన ప్రశ్న ఒకటుంది (ప్రశ్న అనే కంటే, ప్రశ్నల సమాహారం అంటే బాగుంటుందనుకుంటా). నా జీవితంలో అత్యంత గడ్డు రోజుల్లో కూడా నా వెంటపడి వేధించిన ప్రశ్నలవి. ఒకసారి వెనక్కితిరిగి చూసుకుంటే, నా జీవితంలో ప్రస్ఫుటంగా కనిపించేవి ఆ ప్రశ్నలే. నా జీవితంలో ప్రతి ముఖ్యమైన ఘట్టంతో ముడిపడి ఉండేవి ఆ ప్రశ్నలే.

అసలు దేవుడున్నాడా? ఉంటే, ఈ ప్రపంచంలో మన పాత్ర ఏమిటి? దేవుడి నుంచి మనమేమి ఆశించాలి? దేవుడే ఉంటే, అతని సృష్టిలో ఇన్ని ద్వందాలెందుకు? కష్టాలెందుకు? మన జీవిత లక్ష్యమేమిటి? (ఈ ప్రశ్నలు చాలమందికి కలిగి ఉండవచ్చు.. వీటిని ప్రస్తావించడం వెనుక నా ఉద్దేశం ఆత్మావలోకనమే తప్ప.... మరేమీ కాదని మనవి)

జీవితంలో కోల్పోవడానికి ఇంకేమీ మిగలనప్పుడు కూడా, నాకు ఆలంబనగా నిలబడ్డవి ఈ ప్రశ్నలే! చిత్రంగా ఉందికదా... నేను ఆ సమయంలో నిరాశా నిస్పృహల్లో పడి కొట్టుకుపోకుండా ఉండడానికి కారణం, ఈ ప్రశ్నలకు సమధానాల కోసం నా ఆరాటమే ముఖ్యకారణమని నా బలమైన విశ్వాసం! మరి ఈ ప్రశ్నలకు నాకు దొరికిన సమాధానాలు సరి అయినవో కాదో నాకు తెలియదు. అసలు దొరికాయని ఖచ్చితంగా కూడా చెప్పలేను. ప్రశ్నిచే మనస్తత్వం ప్రశ్నగా మిగిలిపోకుండా ఉండాలంటే, కొన్ని అవగాహనలు మనసులో స్తిరంగా నాటుకోవాలి.

అసలు దేవుడున్నాడా....? ఈ ప్రశ్న ఎంతోమందిని, ఎన్నోవిధాలుగా తొలచిన ప్రశ్న! అసలు సమాధనముందో లేదో కూడా తెలియని ప్రశ్న! ఇదే ఖచ్చితమైన సమాధానమని చెప్పలేని ప్రశ్న!

భగవంతుడికి ఒక నిర్వచనాన్ని ఆపాదించే ప్రయత్నం చేసే ముందు, మనం ఒక్కసారి మన చుట్టూ ఉన్న అతని సృష్టిని పరికిద్దాం. సమన్వయ లక్షణభరితమైన ఈ ఖగోళమూ, అందులోని సౌరకుటుంబమూ, ఈ భూమీ, దాని మీద ప్రాణులు, నదులూ, పర్వతాలూ, ఋతువులూ, ఎండా, వానా, గాలీ, పగలూ, రాత్రీ, చెట్లూ, పూలూ,పళ్ళూ, ....ఒహ్! సమ్మోహనభరితమైన, సర్వశ్రేష్టమైన ఈ సృష్టిని పరికించడానికి రెండు కళ్ళూ సరిపోతాయా? అబ్బురపరిచే ఈ సృష్టిని ఎన్నివేల మేధస్సులు కలిసి నిర్మించగలవు? వీటన్నిటికీ కారణభూతమైన, అనంతమైన ఆ అదృశ్యశక్తిని, ఎంతో పరిమితమైన మన మేధస్సు నిర్వచించగలదా?

ఎన్నో అద్భుతాలను ప్రోదిచేసుకున్న ఈ సృష్టిని అనుభవించడాం ద్వారా మాత్రమే, ఆ సృష్టికర్త మనకు అవగతమౌతాడు. మన మేధస్సుకున్న పరిమితులను మరచిపోయి, భగవంతుడిని ఒక నిర్వచనంలో బంధించాలని ప్రయత్నిచినప్పుడే, సంక్లిష్టత మొదలౌతుంది. సృష్టియొక్క మహనీయత మనకు అవగతమైన నాడు, సృష్టికర్తను అర్ధం చేసుకునే ప్రయత్నం చేయము.

అయితే, ఇక్కడవచ్చిన చిక్కల్లా, మనము, మన తర్కాన్ని, నమ్మకాలనూ, ఇష్టాలనూ, భక్తినీ ఉపయోగించి ఓ భగవంతుణ్ణి సృష్టించేస్తాం. కొన్ని గుణగణాలను, ఆ భగవంతునికి అంటగట్టేస్తాం. ఇలా, మెల్లగా, మనకు తెలియకుండానే, మనం సృష్టించుకున్న ఆ దేవుణ్ణి నమ్మడం మొదలు పెడతాము. కానీ, అసలైన జ్ఞాని, తనను సృష్టించిన భగవంతుణ్ణి మాత్రమే నమ్ముతాడు. దురదృష్ట వశాత్తూ, మనలో చాలామందిమి మొదటి కోవకే చెందుతాము. మన నమ్మకానికీ, వాస్తవానికీ తేడా వచ్చినప్పుడు, నిరాశకు లోనౌతాము. భగవంతుణ్ణి నిందిస్తాము.

అసలు భగవంతుణ్ణి అర్ధం చేసుకో గలమా? నా దృష్టిలో ఈ సంక్లిష్టతకు మూలకారణం, మనం భగవంతుణ్ణి అర్ధం చేసుకోవాలని ప్రయత్నిచడమే (తెలిసో, తెలియకో). బిడ్డ తన తల్లిని పూర్తిగా నమ్ముతుంది. ఎప్పుడూ ముద్దు చేసే అమ్మ, అప్పుడప్పుడూ తన చిన్నారిని దండిస్తుంది కూడా. మన్ను తిన్నందుకు కొట్టినా కూడా, అమ్మను పట్టుకుని ఏడుస్తుందే తప్ప, అమ్మను అర్ధం చేసుకోవాలని ప్రయత్నిచదు. అమ్మ మీది విశ్వాసం, అమ్మ ప్రవర్తనలోని ఈ ద్వందాలను (ప్రేమ, దండన) పూర్తిగా అంగీకరించేలా చేస్తుంది. అందుకే పాపాయి లోకంలో ఎల్లలెరుగని ఆనందాలు!

ఉదాహరణకు, ఆటపాటల్లో మునిగి ఉన్న పాపాయిని, తిండికి సమయమయ్యిందని అమ్మ బలవంతంగా తీసుకెళుతుంది. పాపాయికి సంబంధించినంతవరకు, అమ్మ అలా తీసుకెళడం ఒక వైపరీత్యమే. కానీ, పాపాయికి ఎప్పుడు ఏమి కావాలో అమ్మకంటే బాగా ఎవరికి తెలుస్తుంది... అమ్మ మీద విశ్వాసం మాత్రమే ఉన్న పాపాయి, తనకు కోపమొచ్చినా కూడా, అమ్మను గట్టిగా పట్టుకుని ఏడుస్తుందే కానీ, అమ్మకు దూరంగా జరగదు. కాస్సేపటికి మరచిపోతుంది. అలాగే, భగవంతుడు తనకు ఆశాభంగం కలిగించినట్లు పైకి కనిపించినా, ఆయన ఎరుక గలిగిన వాడు,ఆయనపై విశ్వాసాన్ని చెదరనివ్వడు.

ఇంకో ఉదాహరణ. హటాత్తుగా ఒక పిల్లిని చూసి పాపాయి భయపడుతుంది. వెంటనే, ఏడుస్తూ అమ్మ కోసం లోపలికి పరుగెడుతుంది. అమ్మ కనపడగానే, అమ్మ చేతుల్లో వాలగానే ఒక్క సారిగా తన భయాన్ని మరచిపోయి, ధైర్యంగా వెనక్కి తిరిగి చూస్తుంది! భయానికి ఒకేఒక్క విరుగుడు విశ్వాసం! అదే విధంగా, భగవంతుడి ప్రేమపై, అచంచలమైన విశ్వాసమే మన జీవితంలోని కష్టాలన్నిటికీ విరుగుడు.

కానీ, చిత్రమేమిటంటే, ఇలా ప్రోది చేసుకున్న విశ్వాసమంతా, అప్పుడప్పుడూ బాధలూ, కష్టాలవల్ల కలిగే రంధ్రాల్లోంచి జారిపోతుంది. మళ్ళీ కరువు మొదలౌతుంది. మళ్ళీ వెదుకులాట ప్రారంభం. ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే అనుభవం వల్ల మళ్ళీ నమ్మకం స్థిరపడిందని ఊహించుకొంటాం. అరర్రే.... ఇప్పటివరకూ భగవంతుడి ప్రేమను సంశయించామేనని బాధ పడతాం. కానీ, ఇంతలోనే మళ్ళీ సమస్యల సుడిగుండాలు... కష్టాలూ, కన్నీళ్ళూ,నిష్ఠూరాలూ... అనుమానపు సింహం మళ్ళీ జూలు విదిలిస్తుంది. దేవుడు నిజంగా ఉన్నాడా అన్న ప్రశ్న మళ్ళీ ఉదయిస్తుంది. ఎందుకైనా మంచిది అన్న తలంపుతో, ఏమౌతుందో అన్న భయంతో, దేవుడిపై నమ్మకాన్ని వీడలేక, తిరిగి విశ్వాసాన్ని కూడదీసుకోలేక.....ఊగిసలాడుతూ, జీవితాన్ని గడిపేస్తాము!

గర్భం నుంచి సమాధి దాకా ఉన్న సన్నటి ఇరుకైన దారే జీవితం. ఈ ద్వందాల నడుమ నిరంతర ఊగిసలాటే జీవితం.

మరైతే మన జీవిత లక్ష్యమేమిటి? అనంద్ (హిందీ సినిమా) చూసిన వాళ్ళకు గుర్తు ఉండేవుంటుంది....చివర్లో రాజేష్ ఖన్నా డైలాగు...... "హం సబ్ ఊపర్ వాలే కె హాత్ మే బాంధే హువే కట్పుత్లియా హై..."

చాన్నాళ్ళక్రితం, నాకూ, నా ప్రియమిత్రుడికి చిన్న సంవాదం జరిగింది. "దేవుడనేవాడు ఒక రిఫరీ లాంటివాడు. మనల్ని పైనుంచి గమనిస్తూ ఉంటాడు. ఏ మార్గంలో వెళ్ళాలీ అనేది మనమే నిర్ణయించుకోవాలీ...." ఇదీ మా వాడి వాదన.

మనిషికి నిజంగా తన చేతలపై, మాటలపై, చేసే పనులపై, అలోచనలపై....ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, తను చేసే ఏ పనిపైనైనా నియంత్రణ ఉందా? నా ఉద్దేశంలో, సృష్టినీ, సృష్టికర్తనూ వేరుగా చూడడంవల్ల మాత్రమే, ఈ ప్రశ్న, కలుగుతుందనుకుంటాను. మనమే ఆయన ఇచ్ఛామాత్రము చేత సృష్టింపబడినప్పుడు, మన చేతలు మాత్రం మన ఇచ్ఛ ఎలా అవుతాయి? ఇవే మాటల్ని ఓ సినీ కవి(వేటూరి?) చాలా సరళమైన మాటల్లో చెప్పారు......

"నరుడి బ్రతుకు నటన..
ఈశ్వరుడి తలపు ఘటన....
ఈ రెంటి నట్టనడుమ,
నీకెందుకింత తపన...."


మరైతే జీవించడం ఎందుకు? జీవిత లక్ష్యం ఏమిటి? ఓ మహానుభవుడన్నట్లు, "ఏదో సాధించడం కాదు జీవిత లక్ష్యం, నువ్వే భగవంతుడు సాధించిన దానికి తార్కాణం".

"అంతా ముందే నిర్ణయిచబడింది" అన్న వాదనను విశ్వసించాలీ అంటే, ముందుగా ఈ మూడు సూత్రాలూ వంటబట్టాలి....

1. సమస్తమూ ఆయనే.
2. సమస్తమూ ఆయనే చేస్తాడు.
3. సమస్తమూ ఆయన మన మంచికోసమే చేస్తాడు.

మరి దీన్నెలా నమ్మడమూ అంటే, అంతా ఆయనే చేస్తాడు కనుక, మనం నమ్మడమూ నమ్మకపోవడమూ... అంతా ఆయన పనే. ఇంకోలా చెప్పాలంటే, ఇది వాస్తవం కనుక, మనం ఒప్పుకోవడమూ, ఒప్పుకోకపోవడమూ అన్నది అర్ధరహితము.

17 comments:

Kathi Mahesh Kumar said...

God created man కన్నా, man created God అంటేనే సరైందనుకుంటా. మనకు కష్టాల్లో ఒక anchor కావాలి. అతడే ‘దేవుడు’. ఉంటే మంచిదే,లేకుంటే కాస్త కష్టం.

కొత్త పాళీ said...

చాలా క్లిష్టమైన విషయాన్నీ, చాలా ఆంతరంగికమైన విషయాన్నీ, ఓపిగ్గా, విపులంగా, వివరంగా, బాగా రాశారండీ. అవును. ఎడతెగని ప్రశ్నలు. జీవితంలో సందిగ్ధ పరిస్థితుల్లో ఈ ప్రశ్నలు అవలంబంగా నిలిచాయని నేను కూడా నమ్ముతాను. కొన్నాళ్ళ క్రితం ఇంచుమించు ఇదేకోవలో .. జీవిత పరమార్ధం ఏవిటని మన బ్లాగరల్ని అడిగాను. ఆ సందర్భంగా మంచి చర్చ జరిగింది. చూడండి. అందులోంచి మీకేవన్నా కొత్త విషయాలు తడితే .. అది కూడా పంచుకోవడం మరువకండేం!
టపా లింకు ఇది.

GIREESH K. said...

కొత్తపాళీ గారు, మీ అభినందనకు కృతజ్ఞతలు!

దాదాపు రెణ్ణెళ్ళ క్రితం, మీరు లేవదీసిన ఆ చర్చలో నేనుకూడా పాలుపంచుకున్నాను. ఆ తరువాత, ఆ ప్రేరణతోనే ఏప్రిల్ నెల చివర్లో "సత్యం.. శివం..సుందరం" అన్న రెండుభాగాల కథ వ్రాసాను. దయచేసి గమనిచగలరు.

ఈ విషయాలు, అర్ధమయినట్లే ఉంటాయి. మనసులో బలంగా నాటుకున్నాయీ అన్న నమ్మకం కలుగుతుంది. కానీ, అంతలోనే తేలిగ్గా అంతా మరచిపోతాము. ఈ విషయాలను మళ్ళీ మళ్ళీ పునఃశ్చరణ చేసుకోవడంద్వారా, సృష్టి మర్మాలపైనుంచి మన దృష్టి మరలకుండా ఉంచుకోవచ్చు. ఆ ప్రయత్నమే ఈ టపా.

As an English poet said, "If the doors of perception were cleansed, everything would appear to man as it is - infinite".

So let us cleans our doors of perception. Understand. Accept. And Transcend.

మీ స్పందనకు కృతజ్ఞతలు!

- గిరీష్

కొత్త పాళీ said...

అయ్యో. మొత్తానికి మీర్రాసినవి మిస్సయ్యానండీ. నయమే, ఇప్పుడైనా తెలిసింది. మళ్ళి మాట్లాడుదాం.

spandana said...

గిరీష్ గారూ,

"కలం కలలు"లో మీ వాఖ్య చూసి మీ బ్లాగుకు వచ్చాను.
తల్లిలా చూసుకొనే భగవంతుడొకడున్నాడనే విషయాన్ని నేను నమ్మను. భగవంతుడికి (వుంటే) ప్రేమ లేదా ద్వేషం వుంటాయనీ నమ్మను.

నా అభిప్రాయాలపై మీకు ఆసక్తి వుంటే నా బ్లాగులో "ఆధ్యాత్మిక" విభాగం (http://www.charasala.com/blog/?cat=3) చూడండి.

--ప్రసాద్
http://blog.charasala.com

GIREESH K. said...

"తల్లిలా చూసుకొనే భగవంతుడొకడున్నాడనే విషయాన్ని నేను నమ్మను. భగవంతుడికి (వుంటే) ప్రేమ లేదా ద్వేషం వుంటాయనీ నమ్మను".

ఇది మీ అభిప్రాయం కాబట్టి, దీనిపై వాదనకు తావులేదు.

మీ బ్లాగులో మీ అభిప్రాయాలను కూడా చదివాను.

ఇక నా అభిప్రాయం చెబుతాను వినండి మరి:
భగవంతుడిని నిర్వచించడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. భగవంతుని ఉనికి గురించి కూడా వాదోపవాదాలు ఎన్నో ఉన్నాయి.

మీ బ్లాగు చదివినతరువాత, నాకర్ధమయినదేమిటంటే, మీరు భగవంతుడిపై ఎక్కడా అవిశ్వాశాన్ని వ్యక్తపరచలేదు. కాకపోతే, మన ఇద్దరి అభిప్రాయాల్లో తేడా భవంతుణ్ణి నిర్వచించడానికి చేసిన ప్రయత్నంలోనే.

నాశనము చేయడానికి వీలుపడని మాయవలనే, మనతోనూ, మనలోనూ ఉన్న ఆ అంతర్యామి కోసం అన్వేషణ మొదలుపెడతాం. నా దృష్టిలో భవంతుడు మనకి ఎంత సన్నిహితుడంటే,ఆయన్ను చేరడానికి ఒక మార్గం అవసరమేమీ లేదు. భగవంతుడి సృష్టిలో అసమానతలకు తావే లేదు. కాకపోతే, మనకు అవగతం కాని ఈ విరుధ్ధాలన్నీ apparent మాత్రమే.

ప్రతిదీ మన తర్కానికి అందాలనుకోవడం అవివేకమని నా అభిప్రాయం. మన "తర్కం" యొక్క limitation మనము మరచిపోయిననాడు, ఈ గందరగోళం కలుగుతుంది.

అవగాహనుకు, భావానికీ అందని భగవంతుడి ప్రేమని అన్వేషించవలసిన అవసరం లేదు అన్నది, నా నిశ్చితాభిప్రాయం!

spandana said...

గిరీశ్ గారూ,
"మీ బ్లాగు చదివినతరువాత, నాకర్ధమయినదేమిటంటే, మీరు భగవంతుడిపై ఎక్కడా అవిశ్వాశాన్ని వ్యక్తపరచలేదు. కాకపోతే, మన ఇద్దరి అభిప్రాయాల్లో తేడా భవంతుణ్ణి నిర్వచించడానికి చేసిన ప్రయత్నంలోనే."

నిజమేనేమొ! అధిక సంఖ్యాకులు నమ్ముతున్న తీరులో నేను భగవంతున్ని నమ్మను. అయితే నేనూ నాకు సత్యమని తోచినదాన్ని నమ్ముతున్నాను. నా హేతువుకు, తర్కానికి అందినదాన్ని నమ్ముతున్నాను. తర్కానికి అందనిదేదో వుంది అని మీరు నమ్ముతున్నారు. ఇలా మన మన నమ్మకాలని భగవంతునికిస్తున్న వేరు వేరు నిర్వచనాలని మీరనుకొన్నట్లే అందరూ అనుకుంటే ఈ మతాల ఘర్షణ ఇంతలా వుండకపోయుండును.

అయితే నాకెప్పటికీ అర్థం కానిది భగవంతుడు ప్రేమాస్పదుడు అనడం.

--ప్రసాద్
http://blog.charasala.com

GIREESH K. said...

ప్రసాద్ గారు,
భగవంతుడు ప్రేమాస్పదుడు కాదు అని మీరెందుకనుకుంటున్నారు?
మరితే మనకూ, భగవంతుడికీ ఉన్న సంబంధమేమిటనుకుంటున్నారు?

- గిరీష్

Kathi Mahesh Kumar said...

@గిరీష్, భగవంతుడు నిజంగా ఉంటే అతడు ప్రేమాస్పదుడు అయ్యే అవకాశం లేదు. కారణం, సృష్టికర్త భావాలకు అతీతుడుగా ఉండాలికాబట్టి.ఇంతలోకాన్ని "manage" చెయ్యాలంటే, ఆ చేసేవాడికి "detachment", "disinterestedness" రెండూకావాలి. అవి కాకుండా ప్రేమా,ద్వేషంలాంటి "చిన్న భావాలు" ఉంటే కష్టమే!

spandana said...

నా మట్టుకు ముందసలు భగవంతుడు లేడు. ఈ విశ్వం, ఈ సృష్టి ఇదంతా కూడా ఏ కారణమూ, కారకుడూ లేకుండా అలా నడుస్తూ వుందంతే! ఇది చాలా మందికి వితండంగానూ, వింతగానూ అనిపించవచ్చు. అయితే నాకర్థమయ్యిందేమంటే ఈ సృష్టి నిరంతరం మార్పులకు లోనవుతూ ప్రతి క్షణం ఒక స్థితి నుంచీ మరో స్థితికి మారుతూనే వుంది. అలా మారుతూ వుండటానికీ, మారకుండా వుండటానికీ దేనికి నిర్ధిష్టమైన కారణమేదీ లేదు.
దీనికేదో ఓ కారణం వుంది అనుకొని ఆ తర్వాత దానికో కారకున్ని పట్టుకొని ఆయనను దేవున్ని చేస్తున్నారంతే!
ఒకవేళ ఈ చరాచర జగత్తుకంతా ఓ శక్తి కారణమైతే, ఆ శక్తికి ఓ సంకల్పం వుంటే అపుడు ఆ శక్తికి ప్రేమ,దయా లాంటి గుణాలు ఆపాదించవచ్చు. కానీ నాకలాంటివేవీ కనిపించడం లేదు. "కలం కలల" ప్రవీణ్ చెప్పినట్లు మీ దృష్టిని ఈ సౌర కుటుంభాన్నీ, పాల పుంతల్ని దాటి, దాటి అక్కడ్నుంచి చూడండి. అలాగే వంద సంవత్సరాలు ఓ లిప్తకాలం అయ్యే ఏ బ్రహ్మ లోకానికో వెళ్ళి ఈ చిన్ని భూమిని, అందులోని జీవరాశిని గూర్చి ఆలోచించండి. అపుడు మీరనే ప్రేమ, ద్వేషం, అనురాగం లాంటివన్నీ అసలు కనిపించనే కనిపించవు. ఇక దేవుడి ప్రేమ ఎక్కడ ఆవిషృతమవుతుంది?

ఈ క్షణంలో పుట్టి ఆ క్షణంలో మరణించే శిలీంద్రాలమీద మనకెంత ప్రేమో, వుంటే గింటే దేవుడికీ మనమీద అంత ప్రేమ వుంటుందేమొ!

దేవుడి సృష్టి జరిగింది మన మెదడులో తప్ప మరెక్కడా కాదు అనేది దృఢ నమ్మకం.

--ప్రసాద్
http://blog.charasala.com

Anonymous said...

ప్రసాద్ గారూ.. నేను అబ్రకదబ్ర గారి బ్లాగులో ఎక్కడో రాసానిది. మనిషి దేవుణ్ణి సృష్టించాడూ అనే స్టాండ్ తీసుకోవటం చాలా ఈజీ అండీ, ఎందుకంటే మనక్కనబడేది అదే కాబట్టి. అందులోనూ మనిషి క్రియెట్ చేసిన organized religion, అది వేసిన, వేస్తూన్న వికృత వేషాలూ చూస్తూంటే దేవుడికి దూరంగానే పొవాలనిపిస్తుంది ఎవరికైనా.

But don't forget "the absence of presence doesn't mean presence of absence". అదంత ఈజీ అయితే మనకు ఈ విశ్వం, అందులోని principles ఎప్పుడో అర్ధం అయిపొయి ఉండాలి. మీరు ఈ విశ్వం అంతా "కారణం" లేని సృష్టి అనే స్టాండ్ తీసుకోలేరు atleast not yet. ఎందుకంటే సైన్స్ విశ్వాన్ని ఇంకా శోధించుతూనే వుంది. వాళ్ళు ఏదో ఒకటి conclude చేసే దాకా ఓపిక పట్టండి మరి.

Dr penrose experiments ఎపుడైనా చదివారా. వాటికే ఇప్పటి వరకూ సరైన సమాధానం లేదు. అపుడే మనకు అంతా అర్ధమయి పోయింది అనుకుంటే ఎలా.

అయితే మీకో మాంఛి strong point ఉంది మీ వైపు. దేవుడు ఉన్నాడూ అంటున్న వాళ్ళంతా కూడా, ఆ థియరీ propose చేస్తున్నది వాళ్ళు కాబట్టి, burden of proof lies on them. అంతవరకూ మీదే పై చేయి.

కాని ఎవరూ కూడా దేవుడు లేడూ అని prove చేయలేరు. ఉంటే యేదీ చూపించు అనే పిడి వాదం తప్ప.

GIREESH K. said...

@ మహేష్,
ఇంతలోకాన్ని "manage" చెయ్యాలంటే, ఆ చేసేవాడికి "detachment", "disinterestedness" రెండూకావాలి.

ఇది మీ ట్రేడ్ మార్కు రిమార్కు! 'భగవంతుడు ఇంతలోకాన్ని manage చెయ్యడమనేది' గొప్ప భావం. మీరు చాలా సరళమైన భాషలో అక్షరీకరించారు! I liked it very much.

కాకపోతే, నా ఉద్దేశంలో, భవంతుడు ఇంతలోకాన్ని, ఇంత క్రమబద్ధంగా manage చేస్తున్నాడూ అంటే కారణం, తను ఈ లోకాన్ని అమితంగా, ఎంతో ఘాడంగా ప్రేమించడమే! తను సృష్టించిన ఈ లోకంతో attachment, interest లేకపోతే, ఈ సృష్టి ఇంత perfect గా ఉండదేమో!

తరువాత ప్రశ్న, ఈ సృష్టి perfect గా ఉందా అని? నా అబిప్రాయం : శాస్త్రపరంగా సమన్వయ లక్షణభరితమైన ఈ సౌరకుటుంబం; దాన్ని అంతర్భాగం చేసుకున్న ఈ విశ్వం, వైవిధ్యభరితమైన ఈ అనంత జీవకోటి, జీవులన్నిటి మధ్య ఉన్న (వాటి మనుగడకెంతో అవసరమైన) interdependency - ఇవన్నీ ప్రావీణ్యం లేని హస్తం నుంచి వచ్చివుండడానికి అవకాశం లేదు!

@ ప్రసాద్ గారు,
భగవంతుడు లేడు అని మీ అభిప్రాయం కాబట్టి, దానిపై నేనేమీ చెప్పలేను.

ఈ సౌర కుటుంభాన్నీ, పాల పుంతల్నిగురించి ఆలోచించిన కొద్దీ, నాకు ఈ సృష్టిలోని "perfection" పై నమ్మకం ఇంకా పెరుగుతూ ఉంటుంది. మీరు చెప్పిన "సృష్టిలోని మార్పులు"కూడా, సృష్టికర్త విరచితమే.

@ Independent:
మీ కామెంటు నాకో పెద్ద కాంప్లిమెంటు! నేను అందరి టపాల్లో మీ కామెంటుకోసం వెతుకుతుంటాను. చాలా లాజికల్ గా, సరళంగా మీరు వ్రాసే కామెంట్లంటే నాకు చాలా ఇష్టం. మీరు బ్లాగు మొదలుపెట్టే రోజుకోసం ఎదురు చూస్తున్నాను!

నెనర్లు!

Anonymous said...

That was one nice compliment Girish. Thanks.
మీ అంతర్ముఖం చదివినప్పట్నుంచీ నేను మిమ్మల్నీ, మీ వ్యాఖ్యల్నీ ఫాలో అవుతుంటాను.

ఈ మధ్యన మీరు ఫణి బ్లాగులో, God doesn't play dice అని ఏదో రాసినట్లున్నారు కదా!.
అప్పుడు కూడా అదే అనుకున్నా. someone is really paying attention అని.

Now, Does God really play dice? I don't know...It's an age old question. I have to ponder on that. May be He does..May be He doesn't. Looks like He does though. But, if He does, then where do I find God? ఇట్లాంటప్పుడే, God is in the gaps అనే statement చాలా appropriate statement అనిపిస్తూంది నాకు.

Later Girish..

sridhar d said...

The point of 'God's existence' was not new and has benn there from time immemorial right from the original Man (post monkey and later stages) started thinking and wondering where did he come from ?. Even our great great grand fathers have discussed like us. The only difference as it appears is the advent of science taking new strides in the invention and technology, human /animal behaviour. The cell behaviour and quarks are the last identified and known pattern known to the scientist.

The amazing and striking thing which i know is no scientist ever said that there is no God, nor did they bother about the existence of one, leave about whether he is loving us in equal or more terms (or may be few?).

The inquisitiveness and the thirst of knowledge they were interested and were motiviated is the baffling point that how this organised structure has been built say from a point of 10^-16 (read 10 to the power of minus 16 to 10^ +23 (as far as my tiny bookish knowledge goes). The invention and parallel creation (modern Vishwamithras?)would keep continuing till the source code is known (again! is it ever there?).

What a wonderful and meaningful discussion started by Gireesh and as well continued by all stalwarts. I am sorry to say this.. but if I put all you guys in a room including me and start a group discussion. the roof is sure going to fall and neighbours will definetly complain past midnight or early hours. haha just in a lighter vien.

By the way my only question remained unanswered so far is whose instruction does the CELL in my body listens to to behave in that particular way ? Do I have the power to alter its directions say neurons / muscular brains etc ? Or is predetermined program written by God, INC., Universe ? or is it a pool of my previous Births actions. Also why do i deserve a rich life like the one given to me ? is it my CHOICE OF BIRTH ? what if i would have born in somalia or zimbabwe ? I am still scratching my head on this

Dear all Sirs now comes my point (hammer) of view -
i) Why waste time in all these dicussion, when life is a gift already in place for say 60-70 years (just on an average) enjoy as much as possible (either in the name of God or without him.

ii) Dont take seriously any thing either existence of God or existence of an ant/Black hole. Let the professional do the job and we nourish their effort like u enjoy ur food irrespective who prepares it and praise if it is worth or atleast the effort put in to prepare (even a biscuit). What i taste cant be explained to any one then how to express this ?

iii) Nothing is permanent in this world. Neither ur blood cell nor the body not even this earth, galaxies. So even our ideas keep changing day after day, year after year. So our experiences and perceptions change in the mode we think is being tracked by this Super Duper computer sitting in the head which mesmerises us all and ascertains that "this is correct /incorrect" and drags us towards only comforts, discussions etc.

iv) I think there is no question of differentiation between God and us..or even the bird sitting on the branch and watching us run around day in and night !! .
As long the difference persists that I am different from You and you are different from me, the argument never ends, the discussions never stops, Centuries simply role out and the CLOCK's hands rotate like a vicious machine drawing us closer and closer towards the final bed. Why cant we re-unite with this universe? why does the difference persists that we all are unique souls and cut above the rest ? Is it the thinking 8 inch muscle machine which can think and differs from other animals?

I think as long as we keep doing differentite ourselves with the creation no answer can ever be found.

Let me take a petty example here.Your office consists of 10000 employees or more, you are just one amongst them but for an outsider you belong to your office and office belongs to you irrespective of whther small or big ? For him you represent the office ? He trusts you for an office. Whereas you dont think so atleast not to the full 100% extent, because you know that different layers exist right from management to the sweeper what functions they do, what powers they poseess and what can they deliver. But does an outsider know all this till he is aware of each and every aspect of your office. To him YOU are the office /mingle with one in whatever capacity for his belief /trust /his work to be done etc.

It is not his mistake neither is it yours, it is each individual perception. Like that the difference between the existence of God sitting in the sky , his attributes, nature, mentality dissappear only when we stop looking at the one sitting pretty in the temple and start believing that YOU are god yourself.

Oh! is this going somewhere else ? But my friends dont you think that what we call cells are manifestation of God, our bones, blood, heart, muscles, nerves, etc etc etc which combine together form I are no less than GOD. I say it is 100% perfectly matches the definition of GOD.

If that be the case shouldn't this small plant in my apartment garden is not God ? I think it is as equal to me in this creation as a cockroach or mosquito or even a brick /stone equals and belongs in the same creation. The differences in the creation, which are apparently appear different all belong to US all and not ME. The wafer thin curtain which obstructs the vision be torn off and see the vision of the Creator (does he exist? as Prasad said ? ). Sir please forget his existence and enjoy the beauty of nature in full. Try to see the same beauty in your difficulties then and then only the real beuty in us comes out. Simple and plain language, but how difficult to really see that nor even i could succeed..Nerves crack practising it but why shouldnt we all give small try for the real enjoyment?

Yes the beauty lies not in success but the effort put in not to find out the creator but to know that iam also a part of creator in the keep trying to a certain without any doubts, no questions sinple and plain enjoyment the nature and the God reveal themselves slowly. Dont be in a hurry to gulp the secrets anf try to understand the Universe and declare that Yes i got the point now. I repeat this agin, Creator has become creation and being a tiny speck of it i say that I am the Creator.. of what ? Headaches to my wife and parents ? No way I take the pride and dare say that i am equivalent to a Pig or the shit of it and there lies no difference between any one of us. The conceptual clarity evolves not in one day or year even a decade but a slow and steady process. Welcome all friends or foes / troubles or happiness .. enjoy all

First try to understand your wife, husband, kids then and then only look about the tree or plant outside. I cant understand my wife yet even after 9 years so i dont think iam eligible to dare think leave about understand the Creator or Creation / how sugar cane plant gives such a sweet sugar by absorbing water in a mud and sunlight, how a thorny plant like a rose gives such an attractive charming flower etc !!.

Sorry for all this lengthy boring discussion as many of you feel and as if all this not known in your elite club but only to remeber that I blong to the universe as Universe belongs to me. I AM a part of it and it is a part of me (by the way search engines may fail here "who am I" ? question and answer of Sri Raman Maharshi ?).

Have to rush so see u later. Iam sure Gireesh will not curse using this page and iam sorry for the typographical Devil (By the way Devil is antonym of the word God ?? or is it a misunderstood wisdom).

Have a Wonderful, Cheerful , Careful and JOYFULL ride / journey all your lives

Sridhar D

GIREESH K. said...

Your comment has certainly added more meaning to my post and subsequent discussion Sridhar. I know its a delayed response, but, I took so much time to understand your eloquent and enthralling thought flow! :)

Sometimes, I strongly feel that we often lose the essence of life in between these questions on life!

Thanks a lot dear friend....!

RG said...

May be Iam a bit late here...I remember an example from one of Scott Adam's blogs.

Say you've grown-up thinking apples are oranges and oranges are apples. But everyone else around know apples are apples and oranges are oranges.

Assuming everyone eats apples and oranges, now what difference does it make if you think apples are oranges and oranges are apples ??
Except your arguments with other people about your opinions about apples and oranges :)

దేవుడున్నాడా లేడా అన్న వాదన కూడా ఇలాంటిదే :) Our opinions doesn't change the fact, whatever it is.

GIREESH K. said...

@ Falling Angel,

Agreed. Our opinions dont change the facts. But, because of this, is it waste to make an effort to understand the fact? Afterall, opinion is a belief held with confidence, not necessarily substantiated by proof. Opinion stems from our effort to understand a fact. And these opinions are the lighthouses guiding our voyage. (This my opinion :))